బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం వేళ వాకింగ్ చేస్తున్న వ్యక్తులకు ఇది కనబడింది. నెమ్మదిగా రోడ్డు దాటుతూ వెళ్తున్న కొండచిలువను చూసి వాకింగ్ చేస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. వారు దాన్ని చూస్తుండగానే అది రోడ్డు దాటి సమీపంలో వున్న పొదల్లోకి వెళ్లిపోయింది.
ఆ కొండచిలువను పలువురు వీడియో తీసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మీరు కూడా చూడండి.
#snake #KBR park #Hyderabad https://t.co/pCw6Q97H4y
— Kaniza Garari (@KanizaGarari) July 18, 2026
