మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:46 IST)

పడక సుఖం కోసం కన్నబిడ్డను కడతేర్చిన మహిళ.. ఎక్కడ?

అవును.. ప్రియుడితో రాసలీలలకు కన్నబిడ్డ అడ్డుగా వున్నాడని ఓ కన్నతల్లి కన్నబిడ్డను కడతేర్చింది. కన్నబిడ్డ ఆకలి కంటే పడక సుఖమే ముఖ్యమనుకుని మాతృత్వానికే తీరని మచ్చ తెచ్చింది. ప్రియుడితో వున్నప్పుడు ఆకలితో ఏడ్చాడని కన్న బిడ్డను కసి తీరా కొట్టింది. ఆ దెబ్బలకు ఆ బిడ్డ కన్నుమూశాడు. తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, కోయిల్మేడు ప్రాంతానికి చెందిన దివ్య(30)కు కొన్నాళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. వైవాహిక జీవితం సాఫిగా సాగిపోతున్నవేళ కుటుంబంలో కలతలు మొదలైయ్యాయి. దీంతో భార్యా భర్తలిద్దరూ విడిపోయారు.

భర్త నుంచి విడిపోయాక దివ్య పిల్లలిద్దర్ని తీసుకుని తుడియలూరుకు మకాం మార్చింది. అక్కడ దివ్యకు రాజదురై అనే స్ధానిక యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
అవకాశం ఉన్నప్పుడల్లా ఇద్దరూ శారీరకంగా కలిసేవారు. కొంతకాలం గడిచాక సహజీవనం మొదలెట్టారు.ఇద్దరూ ఒకే ఇంటిలోకి చేరటంతో ఇంక వారి ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. పైగా లాక్‌డౌన్ కావడంతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అలా దివ్య ప్రియుడు రాజదురై‌తో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పిల్లల్ని బయటకు పంపిస్తుండేది.

ఇలాగే మంగళవారం కూడా రాజదురైతో ఉన్నప్పుడు కొడుకు అభిషేక్‌ను దివ్య బయటకు పంపింది. బయట కూర్చున్న అభిషేక్ ఆకలితో ఏడవటం..తల్లి ప్రియుడితో శారీరకంగా కలిసి వుండటంతో ఆగ్రహం తన్నుకొచ్చింది. వెంటనే బయటకు వచ్చి పిల్లాడ్ని దారుణంగా చితకబాదింది. దీంతో  పిల్లావాడు అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. 
 
కంగారు పడిన దివ్య, రాజదురై 108 అంబులెన్స్ పిలిపించి పిల్లవాడ్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పిల్లవాడికి ఏమైందని  108 సిబ్బంది అడగ్గా  ఆడుకుంటూ ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పింది. దివ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దివ్య, రాజదురైను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. పోలీసులు గట్టిగా అడిగే సరికి తానే చంపామని దివ్య, అమె బాయ్ ఫ్రెండ్ ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.