మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:45 IST)

వైద్య పరికరాల నాణ్యతలో ఎంతో ప్రాముఖ్యతనిస్తాం : చైనా

‘ర్యాపిడ్‌ కిట్లు సరిగా పని చేయడంలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ఏజెన్సీతో చర్చిండంతోపాటు వారికి అన్నివిధాల సహకరిస్తాం.

విదేశాలకు ఎగుమతి చేసే వైద్య పరికరాల నాణ్యతలో చైనా ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది’ అని భారత్‌లోని చైనా రాయబారి జీ రింగ్‌ వెల్లడించారు.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్ట్‌ కిట్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాయబారి వివరణ ఇచ్చారు.