1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:37 IST)

చైనాలో ముద్దుల పోటీ... పలు దేశాల ఆగ్రహం

కరోనాతో ప్రపంచానికి ముప్పు తెచ్చిపెట్టిన చైనా పట్ల యావత్ర్పంచం ఆగ్రహం గా వుండగా ఆ దేశంలోని ఓ ఫ్యాక్టరీ.. ఏమీ ఎరగనట్లు  ముద్దులపోటీలకు దిగింది.

ఇది అన్ని వర్గాల నుంచి విమర్శలకు కారణమైంది. భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తూ సుజౌ నగరంలోని యుయా ఫర్నిచర్ ఫ్యాక్టరీ కిస్సింగ్‌ పోటీని నిర్వహించింది. ఇందుకోసం ఆ ఫ్యాక్టరీ పది జంటలను ఎంపిక చేసింది. అయితే ఈ కిస్సింగ్‌ పోటీలో పాల్గొనేవారు.. ముద్దు పెట్టుకునే క్రమంలో వారు తమ ఫేస్‌ మాస్క్‌లను తొలగించారు.

ఇందుకు సంబంధించిన పోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫ్యాక్టరీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, చైనాలో లాక్‌డౌన్‌ సమయంలో విధించిన అంక్షలు ఎత్తివేయడంతో ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు.

అయితే చాలా రోజుల తర్వాత ఫ్యాక్టరీలో పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ పోటీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించడానికి జంటల మధ్య ప్లెక్సీగ్లాస్‌ ఉంచడం జరిగిందని ఆ ఫ్యాక్టరీ యజమాని చెప్పారు.