శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (12:24 IST)

కరోనా వైరస్ కేంద్రమై వుహాన్‌లో చైనా అధినేత పర్యటన

కరోనా వైరస్ ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి మంగళవారం చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు. గత ఏడాది హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది. కరోనా వైరస్ నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు. 
 
ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు అధికారులు, అధికారులు, వాలంటీర్లు, కరోనా వైరస్ రోగులు, వూహాన్ వాసులను జిన్ పింగ్ ప్రశంసించారు. 
జిన్ పింగ్ వెంట కమ్యూనిస్టు పార్టీ చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ తదితరులున్నారు. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 4 వేలకు చేరింది.