శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (15:15 IST)

విజయవాడలో కరోనా అనుమానితుడు.. ఆస్పత్రిలో చేరిక

కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా లక్షణాల అనుమానంతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర జలుబుతో ఆసుపత్రిలో చేరిన అతని రక్త నమూనాలను వైద్యులు పుణె ల్యాబ్‌కు పంపించారు. రక్త నమూనాల రిపోర్టులు రావడానికి 72 గంటల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. బాధిత వ్యక్తిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతను.. ఇటీవల జర్మనీలో 17 రోజులు బసచేసినట్లు సమాచారం. జర్మనీ, బెంగళూరు, హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించినట్లు గుర్తించారు. రక్తనమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఇతనికి కరోనా వైరస్‌ ఉన్నది? లేనిది వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.