శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:31 IST)

విజ‌య‌వాడ పోలీస్ సిబ్బందికి సేవాపతకాలు

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన సిఆర్ పిఎఫ్, పోలీస్ ఫోర్స్, ఏఆర్, ఎన్ఎస్ఈ, హోంగార్డ్స్ మరియు ఇంటిలిజెన్స్ తదితర విభాగాల్లో 15 నుండి 25 సంవత్సరాల పాటు సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అధికారులు మరియు సిబ్బందిని ప్రతిఏటా ప్రతిష్టాత్మకమైన ఉత్కృష్ట మరియు అతి  ఉత్కృష్ట సేవా పతకాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేయడం జరుగుతుంది.

2019వ సంవత్సరానికి సంబంధించి విజయవాడ నగరంలోని వివిధ విభాగాలలో పని చేయుచున్న 43 మంది అధికారులకు, సిబ్బంది మరియు హోంగార్డులకు ఉత్కృష్ట సేవాపతకాలకు మరియు 24 మందిని అతి ఉతృష్ట సేవాపతకాలకు ఎన్నిక చేయడం జరిగింది.

పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలంగా పారదర్శకంగా మరియు అంకిత భావంతో సమర్ధవంతంగా సేవలు అందించి తద్వారా ఉత్కృష్ట మరియు అతి ఉత్కృష్ట సేవాపతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు హోంగార్డులకు శ‌నివారం న‌గ‌ర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ సీపీ సి.హెచ్.ద్వార‌కా తిరులమలరావు చేతులమీదుగా ఉతృష్ణ, అతి ఉతృష్ట సేవాపతకాలను ప్రదానం చేయటం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... ఈ పతకాలను పొందిన వారిని అభినందించి మున్ముందు మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు మరింత కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో విజయవాడ అదనపు పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు, జాయింట్ పోలీస్ కమీషనర్ డి.నాగేంద్రకుమార్, క్రైమ్ డి.సి.పి డి.కోటేశ్వరరావు ట్రాఫిక్ డిసిపి టి.వి.నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.