మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:48 IST)

టాలీవుడ్‌కి సమ్మర్ సీజన్ పోయింది, ఇక దసరా సీజన్ పరిస్థితి ఏంటి..?

సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా.. ఈ మూడు సీజన్లు. ఈ మూడు సీజన్లలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం.. నిర్మాతలకు లాభాలు రావడం తెలిసిందే. ఈసారి సంక్రాంతి సీజన్లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ కావడం... ఈరెండు సినిమాలు భారీ విజయాల్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. దీంతో నిర్మాతలు సమ్మర్ సీజన్లో రెండుమూడు భారీ చిత్రాలు రిలీజ్ చేయడానికి అలాగే మీడియం సినిమాలు చిన్న సినిమాలు ఇలా చాలా సినిమాలు సమ్మర్ సీజన్ కోసం వెయిట్ చేసాయి.
 
ఇప్పుడు కరోనా వచ్చి సమ్మర్ సీజన్ మొత్తాన్ని దెబ్బకొట్టింది. ఇది టాలీవుడ్‌కి పెద్ద దెబ్బ. దీంతో సమ్మర్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ప్రస్తుతానికి ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. ఆగష్టు నుంచి పెద్ద సినిమాలు థియేటర్ లోకి వస్తాయని.. వార్తలు వస్తున్నాయి. దీంతో ఆగష్టు నుంచి సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
అంతేకాకుండా.. ఈసారి సమ్మర్ సీజన్ మిస్ అయ్యింది కాబట్టి దసరా సీజన్లో సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. అందుచేత ఇప్పుడు అందరి టార్గెట్ దసరా సీజనే. దీని కోసం భారీ చిత్రాల క్యూకడుతున్నాయి. చిరంజీవి ఆచార్య, బాలయ్య - బోయపాటి మూవీ, కేజీఎఫ్ 2, పూరి - విజయ్‌ల ఫైటర్... ఇలా చాలా సినిమాలు దసరాకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మరి.. దసరా సీజన్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో.. అందులో ఏయే సినిమాలు సక్సస్ సాధిస్తాయో చూద్దాం.