1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. pm narendra modi convoy blocked on flyover in punjab

పీఎం మోదీకి చేదు అనుభ‌వం! ఫ్లైఓవర్ పై 20 నిమిషాలు నిలిచిన కాన్వాయ్!

pm narendra modi
ప్రధాని మోదీకి పంజాబ్ పర్యటనలో చేదు అనుభ‌వం ఎదుర‌యింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల సేపు నిలిచిపోయింది. నిరసనకారులు రోడ్డును నిర్బంధించడంతో మోదీ ఫ్లైఓవర్ పైనే ఆగిపోయారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతి పెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
 
మరోవైపు ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి భతిండా ఎయిర్ పోర్టుకు మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న అధికారులతో ఆయన మాట్లాడుతూ, 'భతిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్' అని అన్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది. దీనిని పీఎంఓ సీరియ‌స్ గా ప‌రిగ‌ణిస్తోంది.
తర్వాతి కథనం
ఏం చేసినా ఈ ఏడాదే... టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కంగారు!