షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ కొత్త ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఆరు లేన్లుగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. మొట్టమొదటి ఆరు లేన్ల ఫ్లైఓవర్ ఇది.
ఈ షేక్‌పేట్ ఫ్లైఓవర్ నాలుగు జంక్షన్ల మీదుగా సాగుతుంది. షేక్‌పేట్, ఫిల్మ్‌నగర్, ఉస్మానియా యూనివర్శిటీ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లను మీదుగా ప్రయాణం సాగించడానికి వీలుగా ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 333.55 కోట్ల రూపాయలతో వ్యయంతో దీన్ని నిర్మించింది కేసీఆర్ సర్కార్. దీని పొడవు 2.71 కిలోమీటర్లు. వెడల్పు సుమారు 24 మీటర్లు. ఆరు లేన్లుగా..రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీన్ని డిజైన్ చేశారు.