శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (16:27 IST)

‘వావ్‌.. వాట్‌ ఎ స్కీం.. వాట్‌ ఎ షేమ్‌. రూ.50లకే చీప్‌ లిక్కర్‌!

ఏపీ భాజపా నేతలు మరింత దిగజారిపోయారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్‌ లిక్కర్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘వావ్‌.. వాట్‌ ఎ స్కీం.. వాట్‌ ఎ షేమ్‌. రూ.50లకే చీప్‌ లిక్కర్‌ భాజపా జాతీయ విధానమా?అధికారం కోసం బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
 
విజయవాడ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... చీప్‌ లిక్కర్‌ తయారుచేసి అమ్ముతోందని ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు రాబట్టి, వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరారు. చీప్‌ లిక్కర్‌ రూ.70కే ఇస్తామని.. రాబడి బాగుంటే రూ.50కే ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా కేటీఆర్‌ స్పందించారు.