గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (10:47 IST)

ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు : శ్రీకాంత్ కిడాంబికి సిల్వర్ మెడల్‌

స్పెయిన్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత ఆటగాడు శ్రీకాంత్ కిడాంబి ఫైనల్ పోటీల్లో ఓడిపోయాడు. దీంతో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22 తేడాతో సింగపూర్‌కు చెందిన కీన్ యూ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 
 
ఫలితంగా రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం శ్రీకాంత్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. అలాగే, ట్వీట్ చేశారు.
 
"ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో అద్భుత ఆటతీరుతో భారత్‌కు రజత పతకం సాధించిన శ్రీకాంత్‌కు నా అభినందనలు" అని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.