16 ఏళ్ల బాలిక పాఠశాలలో గుండెపోటుతో మృతి
16 ఏళ్ల ప్రాయంలోనే ఆ బాలిక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గుండెపోటు కారణంగా 16 ఏళ్ల బాలిక మధ్యప్రదేశ్‌లో మరణించింది. చలి తీవ్రత మధ్య స్కూల్కు వెళ్లిన ఓ 16ఏళ్ల బాలిక.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయి వుంటుందని పోలీసులు తెలిపారు
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ ఉషా నగర్ ప్రాంతంకు చెందిన వ్రిందా త్రిపాఠీ .. రిపబ్లిక్ సెలబ్రేషన్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్లింది. అందరితో కలిసి హ్యాపీగా వున్న వ్రిందా కానీ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.