శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (20:02 IST)

మ్యారేజ్ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ.. 32 ఏళ్ల వరుడి స్నేహితుడు మృతి

marriage
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రేవాలో ఓ వివాహ వేడుక‌లో డ్యాన్స్ చేస్తూ ఓ వ్య‌క్తి మ‌ర‌ణించ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. రేవాలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న 32 ఏళ్ల వ్యక్తి ఆనందంగా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీని పట్టుకుని పడిపోయాడు. పెళ్లికి వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బ్యాండ్ మేళానికి నృత్యం చేస్తూ పెళ్లి ఊరేగింపుతో కళ్యాణ మండపానికి వెళ్తుండగా.. 32 ఏళ్ల అభయ్ సచన్ ఊరేగింపులో పాల్గొన్నారు. అకస్మాత్తుగా నేలపై పడిపోయిన అతను గుండెపోటుతో మరణించాడు. 
 
అభయ్ వరుడి స్నేహితుడు
వధువు రేవా, వరుడు కాన్పూర్‌కు చెందినవారు. వరుడి స్నేహితుడు అభయ్ సచన్ పెళ్లికి హాజరయ్యేందుకు కాన్పూర్ నుంచి రేవాకు వచ్చాడు. రాత్రి 12 గంటల ప్రాంతంలో బారాతీలంతా ఊరేగింపుగా పాటలు పాడుతూ, నృత్యాలు చేసుకుంటూ కళ్యాణ మండపానికి వెళ్తున్నారు.
 
చలి తీవ్రంగా వున్నా అభయ్ సచన్ ఇతర బరాతీలతో కలిసి నృత్యం చేస్తున్నాడు. కాసేపటి ఒక్కసారిగా కిందపడిపోవడంతో అక్కడికక్కడే తోపులాట జరగడంతో వెంటనే బ్యాండ్‌ను నిలిపివేశారు.
 
అభయ్‌ని సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అభయ్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో అతను డ్యాన్స్ చేస్తూ నేలపై పడిపోతున్నట్లు కనిపించింది. అభయ్ కాన్పూర్‌లోని హన్స్‌పురంలోని ఏజీ ఆవాస్ వికాస్ కాలనీ నివాసి అని పోలీసులు తెలిపారు.