మద్యం మత్తులో సింహంతో పరాచకాలు.. ఏం జరిగిందంటే?
మద్యం మత్తులో వున్న వ్యక్తి సింహంతో పరాచకాలు ఆడాడు. ఈ వీడియోలో వున్న వ్యక్తి సింహం నోటికి ఆహారంగా మారుతాడా అని నెటిజన్లంతా భయపడిపోయారు. అయితే వీడియో చూసినవారంతా టెన్షన్ పడుతూనే నవ్వును ఆపుకోలేకపోయారు.
'లాజికల్ థింకర్' పేరుతో ఈ వీడియోను ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. మద్యం సేవించడం వల్ల మనిషి ప్రవర్తన ఇలా మారిందని క్యాప్షన్ కూడా వుంది.
ఆ సింహం కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి కూర్చిపై కూర్చుని కోడిని చేతపట్టుకుని సింహాన్ని ఆటపట్టించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
అయితే, కొన్ని సెకన్ల తర్వాత, సింహం కోడిని నోట కరుచుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఐదు పెగ్గులేసిన తర్వాత మనిషికి ఇంత ధైర్యం వస్తుందని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.