ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (10:46 IST)

కరోనా వైరస్‌ సోకిన తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో..?

Heart
అమెరికాలో కరోనా వైరస్‌ సోకి తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. 2019 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో యునైటెడ్ స్టేట్స్ చాలా నెలలు స్తంభించిపోయింది.
 
2020లో, ప్రపంచ దేశాలు అపూర్వమైన సాధారణ షట్‌డౌన్‌ను అమలు చేశాయి. ఈ సందర్భంలో, కరోనా వైరస్ ప్రారంభమైన 2020లో గుండె జబ్బుల బాధితుల సంఖ్య కూడా పెరిగింది.
 
2019లో గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య 8,74,613 కాగా, 2020 నాటికి ఈ సంఖ్య 9,28,741కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ.
 
ఇప్పటికే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా పీరియడ్‌లో మరణించినట్లు తెలిసింది.