బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అమెరికాలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళంవాసి మృతి

deadbody
అమెరికాలో విషాదం నెలకొంది. అగ్రరాజ్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం సీమన్ కంపెనీలో చేరిన రవికుమార్ అనే యువకుడు కంటెయినర్ నుంచి జారిపడి మృతి చెందాడు. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి.రవికుమార్ (35)గా గుర్తించారు. ఈయన సీమన్ కంపెనీలో మూడు రోజుల క్రితం ఉద్యోగంలో చేశారు. నౌకలో పని చేసేందుకు మొత్తం 10 మందితో కలిసి ఈ నెల 17వ తేదీన అమెరికాకు వెళ్లాడు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. 
 
బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా, ప్రమాదవశాత్తు కంటెయినరు పైనుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.