గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (11:07 IST)

అమెరికాలో కొనసాగుతున్న కాల్పుల మోత - మరో ముగ్గురు హతం

gunshot
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతోంది. దుండగులు తుపాకీతో చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ దండగుడు ముగ్గురిని కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యకీమాలోని కన్వీనియన్స్‌ స్టోర్‌లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడి వయసు 21 యేళ్ళు. 
 
కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మృతులంతా చైనీయులే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారు. 
 
ఈ రెండు ఘటనలను మరచిపోకముందే వాషింగ్టంన్‌లోని యకీమా నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ముగ్గురిని కాల్చి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె. మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 యేలఅల జారిడ్ హడాక్‌గా గుర్తించారు. కాగా, ఈ యేడాది ఇప్పటివరకు అమెరికాలో జరిగిన 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.