గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (11:02 IST)

ఢిల్లీ మెట్రో రైలులో చంద్రముఖి..

Chandramukhi 2
ఢిల్లీ మెట్రో రైలులో చంద్రముఖి భయపెట్టింది. చంద్రముఖి అనే వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి  ఢిల్లీ మెట్రో రైలులో కనిపించింది. తన రూపం, ప్రవర్తనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చొని సంగీతం వింటున్న ఓ ప్రయాణికుడు చంద్రముఖి నటనకు ప్రభావితుడై సీటు ఖాళీ చేసేంత వరకు భయపడ్డాడు.
 
నోయిడా సెక్టార్ 148 మెట్రో స్టేషన్ సమీపంలో నోయిడా- గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో మార్గంలో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడంతో స్థానికులు స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి విచారణ చేపట్టారు.