శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (15:44 IST)

బురఖా ధరించింది.. స్విగ్గీ బ్యాగు.. నడుస్తూ డెలివరీ..

బురఖా ధరించింది.. స్విగ్గీ బ్యాగు తగిలించుకుంది నడుస్తూ డెలివరీ చేసింది. బురఖా ధరించిన మహిళ ఇలా స్విగ్గీ  డెలీవరీ వుమెన్‌గా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... రిజ్వానా అనే మహిళ బురఖా ధరించి స్విగ్గీ డెలివరీ బ్యాగ్‌లో ఇంటింటికీ వెళ్లి డిస్పోజబుల్ వస్తువులను అమ్మడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె లక్నోలోని ఒక పేద కుటుంబం నుండి వచ్చింది.
 
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చైన్‌లో ఉద్యోగం లేనప్పటికీ, రిజ్వానా తన మునుపటి బ్యాగ్ చిరిగిపోయినందున స్విగ్గీ బ్యాగ్‌ని కొనుగోలు చేసింది. మూడేళ్ల క్రితం ఒంటరి తల్లి అయిన రిజ్వానా తనతోపాటు తన ముగ్గురు పిల్లలను పోషించే బాధ్యతను చూసుకుంటుంది. ఆమె తన పిల్లలను చదివించాలని, స్వయం ఆధారపడి ఉండాలని కోరుకుంటుంది. ఆమె సంకల్పం, కృషి చాలామందికి స్ఫూర్తినిచ్చాయి.