ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (13:35 IST)

నిద్రమత్తులో పక్క తడిపిన ప్రియుడు.. కత్తితో పొడిచిన ప్రియురాలు

knife
అమెరికాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రియుడు నిద్రమత్తులో బెడ్‌పై మూత్ర విసర్జన చేశాడు. దీంతో పట్టరాని కోపంతో ప్రియురాలు అతడిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచింది. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బాధిత యువకుడు తన ప్రియురాలు బ్రియానా లాకోస్ట్(25)తో కలిసి గత యేడాదిన్నరకాలంగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, శనివారం వారిద్దరూ కలిసి ఒకే పడకపై పడుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు నిద్రమత్తలో పక్క తడిపాడు. దీన్ని గమనించిన లాక్టోస్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నిద్రలేచిన వెంటనే అతడిని కొట్టడం ప్రారంభించింది. 
 
ఆమె దెబ్బలు తాళలేక పారిపోయేందుకు ప్రయత్నించగా, వంట గదిలోని కత్తితో ప్రియుడిపై దాడి చేసింది. విచక్షణార రహితంగా పలుమార్లు కత్తితో పొడించింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన లాకోస్ట్ శనివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించినట్టు తెలుస్తోంది.