శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 14 జనవరి 2023 (23:14 IST)

రోజూ ఒక ముక్క జున్ను తింటే?

జున్నులోని సంతృప్త కొవ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ సుమారుగా 2 ఔన్సుల జున్ను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 18 శాతం తగ్గుతుందని చెపుతున్నారు.
 
రోజూ 3/4 ఔన్సుల జున్ను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 8 శాతం తగ్గుతుంది. జున్నులో ఉండే క్యాల్షియం కారణంగా శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 60 ఏళ్లు పైబడిన వారు 12 వారాల పాటు రోజూ ఒక కప్పు వైద్యుల సలహా మేరకు జున్ను తింటే కండరాల పెరుగుదల, బలం పెరుగుతుంది.
 
సిఫార్సు చేసిన మొత్తంలో చీజ్‌తో సహా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.