శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (15:41 IST)

దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌ లో 14 మంది స్వాతంత్ర స‌మ‌ర యోధులు

Paruchuri Gopalakrishna, Damodar Prasad, Basireddy, Ravindra
Paruchuri Gopalakrishna, Damodar Prasad, Basireddy, Ravindra
`దేశం కోసం భ‌గ‌త్ సింగ్ ` సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర స‌మ‌ర యోధుల పాత్ర‌లు వేశాడు. త‌న మీద త‌న‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు అని  రచయిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ అన్నారు. గ‌తంలో అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో  రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు.
 
ఈ సంద‌ర్భంగా ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ, ``అల్లూరి సీతారామ రాజు, భ‌గ‌త్  సింగ్, సుభాష్ చంద్ర‌బోస్ ఇలా స్వాతంత్ర స‌మ‌రయోధుల పాత్ర‌లంటే అన్న ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. అలాంటిది సాహ‌సం చేసి మ‌న రవీంద్ర గోపాల్ `దేశం కోసం భ‌గ‌త్ సింగ్ ` సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర స‌మ‌ర యోధుల పాత్ర‌లు వేశాడు. ఈ విష‌యంలో ర‌వీంద్ర‌ని అభినందిస్తున్నాను.  ఇటీవ‌ల సినిమా చూశాను. ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేశాడు.  ఇందులో పాట‌లు కూడా అద్భుతంగా ఉన్నాయి.  ఈ సినిమా విజ‌యం సాధించి మ‌రెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని ప్రేక్ష‌కులు క‌ల్పించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
 ప్ర‌ముఖ నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ,  డ‌బ్బు కోస‌మే సినిమా తీసే  ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయ‌డం అభినందిద‌గ్గ విష‌యం. నేటి త‌రానికి గాంధీ, భ‌గ‌త్ సింగ్ అంటే ఎవ‌రో తెలియ‌ని ప‌రిస్థితి. కాబ‌ట్టి ఇలాంటి సినిమాలు వ‌స్తే ఎంతో మంది త్యాగఫలం అనే విష‌యం వారికి తెలుస్తుంది.  దేశ‌భ‌క్తితో ఈ సినిమా తీసిన ర‌వీంద్ర గారిని అభినందిస్తూ ..ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ సాధించి ఇలాంటి మంచి సినిమాలు మ‌రెన్నో నిర్మించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బ‌సిరెడ్డి మాట్లాడుతూ...``సినిమా చూశాక ర‌వీంద్ర గోపాల్ ప‌డ్డ క‌ష్టం క‌నిపించింది. పాట‌లు అద్భుతంగా ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన గొప్ప దేశ‌భ‌క్తి చిత్ర‌మిది`` అన్నారు.
 
 ఇంకా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్ర‌ట‌రి ప్ర‌స‌న్న కుమార్,  మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల, ర‌చ‌యిత‌ వ‌డ్లేపల్లి కృష్ణ, ద‌ర్శ‌కుడు బాబ్జీ, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్ కుమార్ మాట్లాడుతూ, సినిమా విజయం కావాలని కోరారు.