శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (18:24 IST)

భగత్ సింగ్ నాటకం రిహార్సల్ చేస్తుండగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..?

Bhagat singh
భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. ఆయనపై జరుగుతున్న ఓ నాటకం కోసం రిహార్సల్ చేస్తుండగా.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి దంపతులు తిప్పాజీ సర్కిల్‌లో చిన్నపాటి హోటల్ నడుపుతుంటారు. వీరికి సంజయ్ అనే కుమారుడు వున్నాడు. 
 
బదవానెలోని ఓ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సంజయ్‌ను ఇంట్లో ఉంచి నాగరాజ్, భాగ్యలక్ష్మీ హోటల్‌కు వెళ్లిపోయారు. అయితే ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సంజయ్ కనిపించాడు. కిందికి దింపి పరీక్షించగా అప్పటికే ప్రాణం పోయిందని తేలింది. 
 
స్కూలులో త్వరలో జరగబోయే వేడుకలలో పాల్గొనేందుకు భగత్ సింగ్ నాటకాన్ని సంజయ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తండ్రి నాగరాజ్ చెప్పారు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న సంజయ్.. ఉరి వేసుకునే సీన్‌ను ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని నాగరాజ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.