ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (19:52 IST)

గోరఖ్ పూర్‌లో టెడ్డీ బేర్ అరెస్ట్.. ఎందుకు?

Teddy
గోరఖ్‌పూర్‌లో రైలు పట్టాల దగ్గర అల్లకల్లోలం సృష్టించినందుకు టెడ్డీ బేర్ దుస్తులు ధరించిన యువకుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అరెస్టు చేసింది. 
 
సోషల్ మీడియా హ్యాండిల్ 'టెడ్డీ గాడ్‌ఫాదర్' ద్వారా వెళ్లే 22 ఏళ్ల సూరజ్ కుమార్, సోషల్ మీడియా రీల్‌ను షూట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
సూరజ్ మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ను దాటడానికి ప్రయత్నించాడు. రైళ్లు వెళుతున్నప్పుడు ట్రాక్‌ల దగ్గర హడావుడి చేశాడు. ఇలా ప్యాసింజర్ రైలులో ఫన్నీ సైగలు చేసిన వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.