గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (13:07 IST)

నాటు నాటు పాటకు చందబ్రోస్‌కు అంతగా పేరు రాలేదా!

chandrabose song
chandrabose song
ఇటీవల ఇండియన్‌ సినిమాలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. గ్లోబ్‌ అవార్డు కూడా అందులోని ‘నాటు నాటు..’ సాంగ్‌కు దక్కింది. అయితే ఈ పాటకు సంగీతం సమకూర్చిన కీరవాణికి అవార్డు దక్కడం ఆయన దానిని గొప్పగా చెప్పుకోవడం జరిగింది. తాజాగా 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయింది. దీనితో తెలుగు సినిమారంగంలోని ప్రముఖులు కూడా తగువిధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఇక ఈ పాటను రాసిన చంద్రబోస్‌కు తగినంత ప్రచారం జరగలేదని కొందరు ప్రముఖులు విమర్శిస్తున్నారు. అసలు సినిమా పాటకు సంగీతం ఎంత ప్రాధాన్యతో సాహిత్యం కూడా అంతే ప్రాధాన్యత వుంటుంది. ట్యూన్‌ను బట్టి సాహిత్యం అందులో సరైన పదాలు పడాలి. అప్పుడే ఆ పాట రక్తికడుతుంది. సరిగ్గా నాటునాటు పాటకు అదే జరిగింది. కానీ అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబోస్‌ను తీసుకెళ్ళకుండా కేవలం రాజమౌళి కుటుంబమే వెళ్లి అక్కడ పండుగ చేసుకోవడం పట్ల కొందరు సినీ గీత రచయితలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై చంద్రబోస్‌ ఆ సందర్భంలో స్పందిస్తూ, నేను రాసిన పాటకు ఇలాంటి అవార్దు రావడం చాలా ఆనందంగా వుంది. అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఇదిలా వుండగా, కీరవాణి ఏ ట్యూన్‌ కట్టినా ముందుగా చంద్రబోస్‌కు వినిపిచండం, చంద్రబోస్‌ పాట రాసిన కీరవాణికి వినిపించడం గత కొన్నేళ్ళుగా జరుగుతుంది. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా వున్నారు. మరి ముందు ముందు మరిన్ని అవార్డ్స్ దీనికి వస్తాయో చూడాలి.