శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (09:02 IST)

లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan  new look
Ram Charan new look
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ RRR. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. అదే క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు సాంగ్‌.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో నామినేట్ అయ్యింది. 
 
RRR సినిమాలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి 2022లో చ‌ర‌ణ్‌కు మంచి మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిల‌వ‌ట‌మే కాకుండా.. 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబ‌ట్టి రామ్ చ‌ర‌ణ్‌.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. 
 
RRR లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను కూడా రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి కొన్ని రోజులే ఉండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఓ ఉత్కంఠ‌త నెల‌కొంది. ఈ కార్య‌క్ర‌మంలో RRR ప్రెస్టీజియ‌స్ అవార్డుల‌ను ద‌క్కించుకుంటుందని ఎంటైర్ ఇండియా ఎదురు చూస్తుంది. 
 
ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి RRR ఎంపికైన ఇదే అవార్డుల కేట‌గిరిలను మార్చిలో జ‌ర‌గ‌బోయే అకాడ‌మీ అవార్డ్స్‌లోనూ గెలుచుకుంటుంద‌ని అందుకు ఇది ఓ హింట్ అని అనుకోవ‌చ్చు. 
 
త్వ‌ర‌లోనే ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ఘ‌నంగా జ‌ర‌గ‌బోయే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో RRR టీమ్‌తో పాటు సినీ తారాలోకమంతా హాజ‌రై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నుంది.