1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (14:19 IST)

సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ఫతే సెట్స్ కు ఎక్కబోతుంది

Sonu Sood, Jacqueline Fernandez
Sonu Sood, Jacqueline Fernandez
సోనూ సూద్ గురించి తెలిసిందే. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ 'ఫతే' తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అత్యంత ప్రభావంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఢిల్లీ, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశానికి కొరియోగ్రఫీ చేయడానికి లాస్ ఏంజిల్స్ నుండి ప్రత్యేక అంతర్జాతీయ సిబ్బందిని రప్పించనున్నారు.
 
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ విన్నప్పుడు నాకు చాలా థ్రిల్ ని కలిగించింది. ఈ సినిమాను 2023లో ప్రారంభం కానుందని.. ఆయన కూడా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాను తెలిపారు. అదేవిధంగా ఇది చాలా శ్రమతో కూడుకున్న చాలా విలువైన సబ్జెక్ట్ అని, ఈ సినిమా ద్వారా ఆయన కూడా చాలా విషయాల్లో నైపుణ్యం సాధించగలనని కోరుకుంటున్నట్లు తెలిపారు. 
 
సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోహీరోయిన్లుగా వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
సోనూ సూద్ , హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో 'యువ', 'అతడు', 'ఆషిక్ బనాయా ఆప్నే', 'జోధా అక్బర్', 'కందిరీగ', 'షూటౌట్ ఎట్ వడాలా' వంటి అనేక హిట్‌లను అందించారు, 'ఆర్... రాజ్‌కుమార్', 'హ్యాపీ న్యూ ఇయర్', 'సింబా' మరియు 'కురుక్షేత్ర', ఇతర వాటిలో అలరించి మెప్పించారు.