ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (12:48 IST)

ఐఐఎం క్యాట్ ఫలితాలు 2022 వెల్లడి - సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

దేశ వ్యాప్తంగా నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2022 పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నవంబరు 27వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించగా, మొత్తం 2.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఐఐఎం బెంగుళూరు తాజాగా వెల్లడించింది. 
 
ఈ ఫలితాల్లో 11 మంది విద్యార్థులు నూటికి 100 మార్కులు సాధించగా, 22 మందికి 99.99 శాతం మార్కులు సాధించారు. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన 11 మంది విద్యార్థుల్లో తెలంగాణాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండటం గమనార్హం. అలాగే, ఢిల్లీ, మహరాష్ట్రలకు చెందిన విద్యార్థులు ఇద్దరేసి చొప్పున ఉన్నారు.
 
వీరితో పాటు హర్యానా, గుజరాత్, కేరళ, మధ్యప్రదే్శ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే, టాపర్ల పేర్లను ఐఐఎం బెంగుళూరు ఇంకా వెల్లడించలేదు. దేశ వ్యాప్తంగా ఐఐఎం, పలు మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రతి యేటా ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది.