మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:38 IST)

ఢిల్లీ మద్యం కుంభకోణం : ఈడీ చార్జిషీటులో కవిత - మాగుంట - శరత్‌ చంద్రారెడ్డి పేర్లు

kavitha
ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత, ఏపీలోని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిల పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తయారు చేసిన చార్జిషీటులో చేర్చింది. ఇందులో పేర్కొన్న అంశాలపై జనవరి ఐదో తేదీలోపు వివరణ ఇవ్వాలని సమీర్ సంస్థలకు కోర్టు ఆదేశించింది.
 
ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టు అయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ చార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లు చేర్చింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన సమీర్ మహేంద్రు. పి.శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ చార్జిషీటును ఈడీ రూపొందించింది. 
 
ఇందులో గత యేడాది జనవరి నెలలో హైదరాబాద్ నగరంలోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమైనట్టు పేర్కొంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అరుణ్ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్‌కు హామీ ఇచ్చారని తెలిపింది.