బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (11:55 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు : కె.కవిత

kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అనేక మంది తెలుగు ప్రముఖుల పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అరబిందో ఫార్మాకు చెందిన ఓ డైరెక్టర్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే, ఈ స్కామ్‌‍లో తెరాస ఎమ్మెల్సీ కె.కవిత పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పైగా, విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు పంపించినట్టు సమాచారం. వీటిపై ఆమె సోమవారం స్పందించారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్.ఐ.ఆర్‌లో తన పేరు లేదని సీబీఐకు ఆమె లేఖ రాశారు. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె అందులో వెల్లడించారు. అయితే, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎపుడైనా తన నివాసంలో విచారణ జరుపవచ్చని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. 
 
పైగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఐఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు తనకు పంపాలని, ఆపై విచారణ తేదీని ఖరారు చేయొచ్చని చెప్పారు. ఆమె కోరిన విధంగానే సీబీఐ అధికారులు వాటిని ఆమెకు పంపించారు. వాటిని పరిశీలించిన కవిత.. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని అందువల్ల విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు. ఈ లేఖపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందే వేచి చూడాల్సింది.