సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (17:44 IST)

వైఎస్ షర్మిల వర్సెస్ ఎంపీ కవిత ట్విట్టర్ వార్

ys sharmila
తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు చర్చనీయాంశమైనాయి. తెలంగాణలో ప్రస్తుతం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. 
 
తన ట్వీట్లతో, బీజేపీ కూడా వార్ నడుపుతోంది. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత మధ్య జరిగిన ట్విట్టర్‌ వాగ్వాదంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వంటి ఇతర బీజేపీ నేతలు కూడా తమ ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్లు పలువురి దృష్టిని ఆకర్షించాయి. నిరసన సమయంలో వైఎస్ షర్మిలతో వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు.
 
అలాగే రాజకీయ నేతలు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ ట్వీట్లను ట్యాగ్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్లను రీపోస్ట్ చేయడంతో, ఎమ్మెల్సీ కవిత వ్యంగ్య ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీశాయి.