సంబంధిత వార్తలు
- గాంధీ కేసులో వీడని మిస్టరీ.. పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు
- పేషెంట్ కోసం అటెండర్‌గా వెళ్లిన అక్కాచెల్లెళ్లు.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఎక్కడ?
- మైనర్ కూతుర్ని అత్యాచారం చేసిన తండ్రి.. పదేళ్ల జైలు శిక్ష
- అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం.. పురుగుల మందు సేవించి చనిపోయాలా చేశారు..
- ప్రశ్నపత్రం లీక్ : పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రద్దు
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఆత్మహత్య చేసుకోమన్నారు.. చివరికి?
అక్కాచెల్లెళ్లపై అకృత్యం జరిగింది. పక్కింటి పోరగాళ్లు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని బెదిరించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది.
ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటుంది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటుంది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు. వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు.
అయితే.. ఆత్మహత్యకు పాల్పడిన అక్కాచెల్లళ్లను స్థానికులు ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఒకరు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరొక అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. పాము కాటేసిందని వారి తల్లి వైద్యులకు చెప్పింది. కాగా, విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
