శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:12 IST)

ప్రశ్నపత్రం లీక్ : పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రద్దు

ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. 
 
పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయని, దాని కారణంగానే పరీక్షను రద్దు చేశామని ప్రకటించింది. అయితే పరీక్ష రద్దయినందుకు అబ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలపింది.