గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (20:22 IST)

ఢిల్లీలో హెరాయిన్ పట్టివేత-350 కేజీల నిషిద్ధ హెరాయిన్‌ స్వాధీనం

Heroin
ఢిల్లీ పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగం శనివారం 350 కేజీల నిషిద్ధ హెరాయిన్‌ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 2,500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు హర్యానాకు ఒకరు ఢిల్లీకి చెందినవారని వారు చెప్పారు. 
 
ఇంత భారీ ఎత్తున డ్రగ్‌ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ గుట్టును రట్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద డ్రగ్ రవాణాను పట్టుకోవడం ఇదే మొదటిసారన్నారు. ప్రస్తుతం నార్కో-టెర్రరిజం కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
 
కొన్ని నెలలుగా ఈ డ్రగ్ దందా సాగుతోందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ హెరాయిన్ మొదట ముంబైకి, ఆ తరువాత సముద్ర మార్గం ద్వారా సీక్రెట్ కంటెయినర్లలో ఢిల్లీకి చేరిందని స్పెషల్ సెల్ చీఫ్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. గతనెలలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 22 లక్షల నిషిద్ధ సైకోట్రోపిక్ టాబ్లెట్స్ ను, 245 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.