మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (15:41 IST)

తేజ సజ్జ హనుమాన్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్‌

కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ పాత్రలకు, లేడీ విలన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమెకి వచ్చిన పేరు ఏ హీరోయిన్‌కి రాలేదని చెప్పాలి. 
 
ఈ ఏడాది రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకు టాలీవుడ్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లరి నరేష్ 'నాంది' సినిమాలోని పాత్రకు కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. 
 
రీసెంట్‌గా గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిన జయమ్మ.. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'హనుమాన్' సినిమాలో వరలక్ష్మీ నటించనుందని తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా నటించనున్న ఈ సినిమాలో వరలక్ష్మీ కీలక పాత్రల్లో నటించనుందని సమాచారం.