ఆదిపురుష్ ఇండియాలోనే అరుదైన రికార్డ్ సృష్టించబోతుంది (video)
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ రెండు సార్లు వాయిదా పడ్డాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మైథలాజికల్ మూవీగా తీర్చిదిద్దబోతున్నారు. మన పురాణాల్లో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటాం. రాముడు అన్నింటికీ ఆదిలాంటివాడు. అలాంటి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. మైథలాజికల్ సినిమా కాబట్టి బాహుబలి రేంజ్‌కు మించి వుండేలా చర్యలు తీసుకోతున్నారు. కథ ప్రకారం అందరికీ తెలిసిందే అయినా సినిమా పరంగా ఏదో కొత్త ప్రక్రియకు శ్రీరారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమాకు సాంకేతికపరంగా ఉన్నతంగా వుండాలని దర్శక నిర్మాతలు భావించారు. కనుక ఈ సినిమాకు వి.ఎఫ్.ఎక్స్. అనేవి కీలకం. ఇవే సినిమాకు అందాన్ని ఉన్నతాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చిన సినిమాలో రోబో, బాహుబలి సినిమాలు. వాటి గురించి వేరే చెప్పక్కర్లేదు. థియేటర్‌లో ప్రేక్షకుడు కన్నార్పకుండా ఆ విన్యాసాలు తిలకించారు. మరలా అలా ప్రేక్షకుల్ని మెప్పించానే కథాపరంగా 8వేల వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఇంతకుముందు రోబో2, బాహుబలి2 సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం.
రోబో2 సినిమాకు 3వేల వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను వినియోగించారు. అక్షయ్ కుమార్ పక్షి ఆకారంలోకి మారి సిటీలోకి విధ్వంసం సృష్టించడం చూశాం. ఇక ప్రభాస్ నటించిన బాహుబలి2కి రాజమౌళి 2,500ల వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ వినియోగించారు. ఆదిపురుష్ రాముడికాలం కాబట్టి మరింతగా వుండేలా 8వేల షాట్స్ పెడుతున్నారు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన రికార్డ్‌గా చెప్పవచ్చు.