గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (17:17 IST)

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో వేట మొదలు

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. మామూలుగా అయితే క్రాక్ సినిమాను బాలయ్య బాబుతోనే తీయాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. క్రాక్ తమిళ సినిమాకు స్ఫూర్తిగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 
 
ఒరిజినల్ తమిళ సినిమా హక్కులు సీ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. ఆ కథనే అటూ ఇటూ మార్చి మాస్ యాంగిల్‌ను జొప్పించి గోపీచంద్ మలినేని అద్భుతంగా తెరకెక్కించారని సీ కళ్యాణ్ అన్నారు. అలా గోపీచంద్ మలినేని బాలయ్య బాబు కాంబినేషన్ అప్పుడు మిస్ అయింది. కానీ ఇప్పుడు మైత్రీ మూవీస్ మాత్రం పక్కాగా ప్లాన్ చేశారు. 
 
ఈ క్రమంలోనే నేటి బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ అదిరిపోయింది. వేట మొదలు అంటూ సింహానికి ప్రతీకగా బాలయ్య బాబును చూపించడంతో ఈ కథ కూడా ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు మాంచి మాస్ మసాలా కథే అన్నట్టు తెలుస్తోంది.