గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (22:11 IST)

భాను శ్రీ కొత్త సినిమా సర్వే నెంబర్.3..

Bhanusri
బిగ్‌బాస్ షో నుంచి వెలుగులోకి వచ్చిన భామ భాను శ్రీ అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటి అభిమానులను సంపాదించుకుంది. ఏడు చేపల కథతో ఈ భామ టాలీవుడ్ అభిమానుల్లో సెగలు పుట్టిస్తోంది. 

ఆ సినిమా ఎలా ఉన్నా కూడా భానుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ హాట్‌గా దర్శనమిస్తూనే ఉంటుంది భాను శ్రీ. 
Bhanusri
 
తాజాగా బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సర్వే నెంబర్.3. ఈ సినిమాను డి. రామకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఆదివారం హైదరాబాదులో ఈ సినిమా కోసం మేకర్స్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భాను శ్రీతో పాటు మేకర్స్ పాల్గొన్నారు.  
Bhanusri