మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (19:16 IST)

సంగం డైరీలో అక్రమాలు-ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై కేసు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించి 20 మందితో హోటల్‌లో మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. నరేంద్రపై ఐపీసీ సెక్షన్ 188, 269, రెడ్ విత్ 34 (3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సంగం డైరీకి సంబంధించి విజయవాడలోని ఒక హోటల్‌లో, నరేంద్ర 20 మందితో మీటింగ్ పెట్టి, వారితో భోజనం చేసినట్లు తెలుసుకున్న పోలీసు, ఎస్సైకి ఫిర్యాదు చేయటంతో పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.  కాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 12 మందితోనే సమావేశం పెట్టుకున్నట్లు సంగం యాజమాన్యం చెపుతోంది. కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
సంగం డైరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఏప్రిల్ 24  తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన్ను అరెస్ట్ చేశారు. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న నరేంద్ర టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
1994 నుంచి 2019 గా పొన్నూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో కిలారి  వెంకటరోశయ్య  చేతిలో ఓడిపోయారు. నరేంద్ర 2010 నుంచి సంగం డైరీకి ఛైర్మన్‌గా ఉంటున్నారు.