శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (10:36 IST)

రూ. 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారం సీజ్‌

తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. 
 
అదేవిధంగా చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 9 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
దుబాయ్‌ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు బుధవారం తెల్లవారుజామున ఇండిగో, ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులను సెంట్రల్‌ విభాగం డిప్యూటీ డైరక్టర్‌ సతీష్‌ నేతృత్వంలోని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. 
 
ఆ సమయంలో ఒక మహిళతో సహా 8 మంది ప్రయాణికుల వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. మరోవైపు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన జైనుల్లా అబద్ధీన్ (60) నుంచి కూడా 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.