1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Spiderman stunt goes wrong, two booked for various offences

"స్పైడర్‌మ్యాన్" కాస్ట్యూమ్స్‌‌తో ఢిల్లీలో తిరిగారు.. ఇద్దరు అరెస్ట్.. ఎందుకు?

spider man
"స్పైడర్‌మ్యాన్" కాస్ట్యూమ్స్‌ ధరించిన 19 ఏళ్ల యువతితో సహా ఇద్దరు యువకులపై ఢిల్లీలో రోడ్డుపై విన్యాసాలు చేస్తూ వివిధ నేరాలకు పాల్పడ్డారని శుక్రవారం అధికారులు తెలిపారు. నిందితులను నజఫ్‌గఢ్‌కు చెందిన ఆదిత్య (20), అంజలి (19)గా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే... హెల్మెట్ లేని వ్యక్తి నంబర్ ప్లేట్ లేకుండా బైక్ నడుపుతూ, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER II) లేదా NH-344Mలో స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్‌లో స్టంట్ చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధానిలో ఈ విధంగా జరగడంపై పోలీసులు నిఘా పెట్టారు. 
 
ఇంకా వారిపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అద్దం లేకుండా, లైసెన్స్ లేకుండా, ప్రమాదకరమైన డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేకుండా నడపటం వంటి నేరాలకు రైడర్లపై కేసు నమోదు చేయబడిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఢిల్లీలో సింగపూర్ ఎయిర్‌‍లైన్స్ పైలట్ అరెస్టు... ఎందుకో తెలుసా?