సంబంధిత వార్తలు
- కంగనా తను లక్ష్మీ బాయి అనుకుంటుందేమో?.. ప్రకాష్ రాజ్ చురకలు
- లాభాపేక్షతో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని హెచ్చరిక
- కార్యకలాపాలు ప్రారంభించకుంటే భూములు వెనక్కి తీసుకుంటాం: కంపెనీలకు కేటీఆర్ హెచ్చరిక
- జలవిద్యుత్ కేంద్రం ముప్పుపై ముందే హెచ్చరిక.. అయినా పట్టించుకోని అధికార గణం
- ధవళేశ్వరం డ్యామ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
కంగనాకు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్
తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా వ్యవహారంపై సిఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు.
తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, రాజకీయాలపై ఇప్పుడేమీ మాట్లాడనని పేర్కొన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని, సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
వీటన్నింటిపై సరైన సమయంలో సిఎం ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ స్పందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిందని, ఈ నెల 15 నుంచి 'నా కుటుంబం - నా బాధ్యత' కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా వైద్యులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
తర్వాతి కథనం
