శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (20:09 IST)

ధవళేశ్వరం డ్యామ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఏపీలో ‌భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద నీరు వ‌చ్చి చేర‌డంతో డ్యామ్‌కు ఉన్న 175 గేట్లను సైతం ఎత్తేశారు. కొద్దిసేపటి క్రితం ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వస్తున్న వరదను వస్తున్నట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పడు వరద ప్రవాహం అంచనాలు తెలుసుకుంటూ.. గోదావరి ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులు మెయిన్ టెయిన చేస్తూ.. ఎగువ నుండి వస్తున్న 10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చేరుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.