సంబంధిత వార్తలు
- గుంటూరులో విషాదం : టిక్ టాక్ ప్రేమ జంట బలవన్మరణం
- నన్ను పెళ్లి చేసుకుని.. నలుగురు అమ్మాయిలతో సహజీవనమా? భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
- కన్నడ హాట్ బ్యూటీ రాగిణి ద్వివేది అరెస్టు... ఎందుకంటే...
- 139 మంది కాదు 36 మందే.. డాలర్ బాయ్‌కు డ్రగ్స్ మాఫియాతో లింకులు : బాధితురాలు
- బ్రెజిల్లో స్నేహితురాలి దుశ్చర్య.. కడుపు కోసి శిశువు కిడ్నాప్
ప్రేమ పేరుతో బాలికపై బలవంతంగా అత్యాచారం..
ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరాఖంఢ్‌లో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా.. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని పంత్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన కిశోర్ అనే మైనర్ బాలుడు పొరుగున నివసించే మరో మైనర్ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. తరువాత ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆగస్టు 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తరువాత విషయం గురించి తల్లిదండ్రులకు తెలుపడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మైనర్‌ను గురువారం అదుపులోకి తీసుకుని జువెనైల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.
