1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Vande Bharat Sleeper Train Passes Water Test At 180 Kmph

వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)

vande bharat train water test
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ళు పగటి పూట మాత్రమే పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్లనున్నాయి. ఈ రైళ్ల భద్రత తనిఖీల్లో భాగంగా వివిధ రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా వందే భారత్ స్లీపర్ రైలులో వాటర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ఇది విజయవంతంగా పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. కోటా-నగ్డా సెక్షన్ మధ్య జరిగిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది.
 
ఈ సందర్భంగా రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు అధికారులు వినూత్నంగా వాటర్ టెస్ట్ నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నా, లోపల టేబుల్ మీద పిరమిడ్ ఆకారంలో ఒకదానిపై ఒకటి పేర్చిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. 
 
వీడియోలో మొబైల్ స్పీడోమీటరుపై 182 కిలోమీటర్ల వేగం కనిపిస్తున్నప్పటికీ, రైలు ఏమాత్రం కుదుపులకు లోనుకాకుండా సాఫీగా ప్రయాణించిందని, ఇది ఈ కొత్తతరం రైలు సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పరీక్షలు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 


 
తర్వాతి కథనం
ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)