సెల్‌ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత
నెట్టింట వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సెల్‌ఫోన్ వెలుతురులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికుల భద్రతను గాల్లోకి వదిలేసిన డ్రైవర్... బస్సుకు హెడ్‌లైట్స్ పని చేయకపోవడంతో మొబైల్ ఫోన్ వెలుతురులో డ్రైవింగ్ చేశాడు. కండక్టర్ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి వెలుతురును ముందు చూపిస్తుంటే ఆ వెలుతురులో బస్సును నడిపాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బస్సును కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందినదిగా గుర్తించారు. కలబురిగి నుంచి చించోలి వైపు వెళ్తుండగా రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సులో ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బస్సు హెడ్‌లైట్స్ ఎందుకు పనిచేయలేదనే దానిపై కారణం తెలియరాలేదు.
???? ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್ ಬೆಳಕಿನಲ್ಲಿ ಕೆಕೆಆರ್ಟಿಸಿ ಬಸ್ ಸಂಚಾರ!
— Krishna kulkarni (@Kulkarnikittu) July 5, 2026
ಕಲಬುರಗಿ–ಚಿಂಚೋಳಿ ಮಾರ್ಗದ ಬಸ್ನಲ್ಲಿ ಹೆಡ್ಲೈಟ್ ಇಲ್ಲದೇ ಪ್ರಯಾಣ. ಕಂಡೆಕ್ಟರ್ ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್ ಹಿಡಿದು ದಾರಿ ತೋರಿಸಿದ ಬಳಿಕ ಬಸ್ ಚಾಲನೆ.
ಇದು ರಾಜ್ಯದಲ್ಲಿನ ಬಸ್ ಗಳ ದುಸ್ಥಿತಿ..@Vijayavani_Digi#Kalaburagi #KKRTC #BreakingNews #chincholi #Karnataka pic.twitter.com/msgBZA2uCr
