1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
  4. FREE INSURANCE TO NRIs by AP State Govt.

NRTలకు ఏపీ సీఎం చంద్రబాబు అద్భుతమైన అవకాశం... ఉచితి బీమా సౌకర్యం

ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆంధ్రులు తమ జన్మభూమిని, పుట్టిన ఊరిని మరిచిపోరు. అటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు (NRT) వారి శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆలోచనల నుండి ఏర్పడిందే APNRT. అమరావతి కేంద్రంగా 2016 మే నెల నుండి కార్యకలాప

FREE INSURANCE
ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆంధ్రులు తమ జన్మభూమిని, పుట్టిన ఊరిని మరిచిపోరు. అటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు (NRT) వారి శ్రేయస్సు  కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆలోచనల నుండి ఏర్పడిందే APNRT. అమరావతి కేంద్రంగా 2016 మే నెల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సొసైటీ, ఇతర దేశాలలో ఉంటున్న తెలుగువారికి అనేక రకాల సేవలు అందిస్తోంది.
 
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినపుడు, విదేశీ ప్రభుత్వాల పాలసీలలో మార్పుల వల్ల NRTలు ఇబ్బందులకు గురైనపుడు APNRT వారికి అండగా నిలుస్తోంది. తాజాగా 2018 జనవరిలో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష(Amnesty)ను మన రాష్ట్రానికి చెందినవారు ఎంతోమంది సద్వినియోగం చేసుకోవటంలో APNRT తీసుకున్న చోరవ ప్రపంచ వ్యాప్తంగా గల తెలుగువారి ప్రశంసలు అందుకుంది.  వీటితో పాటు APNRT తన వెబ్ సైట్ ద్వారా, హెల్ప్ లైన్ నంబరు  +91 86323 40678 లేదా +91 8500027678 ద్వారా పలు ఇతర రకాల సేవలను కూడా అందిస్తోంది. 
 
ప్రపాసాంధ్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తూ, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి, అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టటానికి వెసులుబాటు కల్పిస్తున్న APNRT  ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలలో ప్రధానమైనది ఈ ప్రవాసాంధ్ర భరోసా భీమా. మన రాష్ట్రం నుండి ప్రపంచంలోని అనేక దేశాలకు వలస వెళ్లిన తెలుగువారు, జీవనోపాధి కోసం రోజువారి కూలీ పనుల నుండి కోట్ల రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు అనేక రంగాలలో నిలదొక్కుకున్నారు. అటువంటి వారి కోసం పది లక్షల రూపాయల వరకు ఉచిత బీమాను అందించే ఈ ప్రవాసాధ్ర భరోసా బీమా పధకానికి  విశేష స్పందన లభిస్తోంది.
 
ఇప్పటివరకు APNRTలో సభ్యత్వం పొందిన దాదాపు 70 వేలమందిలో, గడచిన నెల రోజులలోనే రెండున్నర వేలమంది ఈ బీమా పధకం కింద రిజిష్టర్ చేసుకున్నారు. మిగిలిన వారందరినీ కూడా ఈ బీమా ఛత్రం కిందకు తీసుకువచ్చి, వారి ఆరోగ్యానికి, జీవితానికి కూడా భరోసా అందించటానికి APNRT  డైరెక్టర్ చప్పిడి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని కడప, చిత్తూరు, కృష్ణా జిల్లాలతో పాటు అనేక ఇతర జిల్లాలలో ఎన్.ఆర్.టిల కుటుంబ సభ్యులకు ఈ బీమా పధకంపై అవగహనా కార్యక్రమాలు నిర్వహించింది.
 
ఈ బీమాను ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్ధులు వర్గాల వారిని లక్ష్యంగా చేసుకోని రూపొందించారు. ఈ రెండు వర్గాల వారు కూడా కేవలం నామమాత్రపు ప్రీమియం చెల్లించటం ద్వారా 10 లక్షల ప్రమాద బీమాను, అదేసమయంలో అనారోగ్యానికి గురైనపుడు 1 లక్ష రూపాయల వరకు చికిత్సకు కూడా పొందవచ్చు.
 
పథకం పొందటానికి అర్హతలు
 
1. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండాలి.
2. 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
3. APNRT SOCIETY సభ్యత్వం కలిగి ఉండాలి. 
 
పథకం పొందగోరు వారు అందించవలసిన వివరములు
1. సభ్యుని పేరు
2. పుట్టిన తేదీ
3. పాస్ పోర్టు నంబరు
4. వీసా వివరము
5. మొబైల్ నంబరు
6. పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న సంస్ధ పేరు, చిరునామా
7. నామినీ పేరు, లబ్దిదారునికి నామినీతో గల సంబంధము
(భార్య, భర్త, కొడుకు, కూతురు, తల్లి, తండ్రి మాత్రమే అర్హులు)
 
ఉద్యోగులకు ఈ బీమా వల్ల కలిగే ప్రయోజనాలు
* బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం కలిగి విదేశములో ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే 10 లక్షల రూపాయలు.
* ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు. 
* ప్రమాదం వలన సంభవించే గాయాలు/అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు.
* బీమా చేయబడిన వ్యక్తి అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
* బీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితిలో సాధారణ ప్రసూతి ఖర్చుల క్రింద 35 వేల రూపాయలు లేదా సిజేరియన్ ఆపరేషన్ ఖర్చుల క్రింద 50 వేల రూపాయలు.
* బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల క్రింద బీమా కాలపరిమితి వరకు సంవత్సరానికి 50 వేల రూపాయలు.
* ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యంతో ఏవేని సమస్యలు తలెత్తినట్లైతే, ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల క్రింద 45 వేల రూపాయలు. 
 
విద్యార్థులకు ఈ బీమా వల్ల కలిగే ప్రయోజనాలు
* బీమా చేయబడిన విద్యార్ధి విదేశాలలో ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగినచో 10 లక్షల రూపాయలు.
* బీమా చేయబడిన విద్యార్థి ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు. 
* విద్యార్థికి ప్రమాదం వలన సంభవించే గాయాల చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు.
* బీమా చేయబడిన విద్యార్థి ప్రమాదమునకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు. 
 
ప్రతి ప్రవాసాంధ్రుడూ ఈ ఉచిత బీమా పథకాన్ని వినియోగించుకుని లబ్ది పొందలనే లక్ష్యంతో ఇప్పటికే NTR  వైద్య సేవపై ప్రజలకు అగాహన కల్పిస్తున్న సెర్ఫ్ సహకారంతో, గ్రామాలలోని బీమా మిత్రలు, వెలుగు సభ్యులు ఈ కార్యక్రమాన్ని గురించి NRTల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, వారిని బీమా ఛత్రం కిందకు తీసుకువస్తున్నామని APNRT ప్రెసిడెంట్ Dr. రవి వేమూరు తెలిపారు. తద్వారా లక్షలాదిమంది తెలుగువారికి ఈ పథకం వర్తించేలా APNRT కార్యక్రమాన్ని రూపొందించింది. విదేశాలలో ఉంటున్న తెలుగువారి బంధువులు తమ గ్రామాలలో గల వెలుగు గ్రామ సంఘాలను సంప్రదించి, ఈ క్రింది వివరాలు అందించి, బీమా ప్రీమియం చెల్లించటం ద్వారా బీమా పథకం కింద రిజిష్టర్ చేసుకోవచ్చు. 
 
బీమాను క్లెయిమ్ చేసే విధానం కూడా ఎంతో సరళతరంగా ఉండేలా APNRT విధివిధానాలను రూపొందించింది. APNRT HELP LINE నంబర్లు  
+91 86323 40678, మరియు  +91 85000 27678కు ఫోన్ చేసి, బీమా వివరాలను అందిస్తే, వెంటనే అవసరమైన చర్యలు చేపడతారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
పురుషులు జామ పువ్వులు, జామ ఆకులు తింటే....