1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
  4. Good news for H1B visa holders

హెచ్1 బీ వీసాదారులకు శుభవార్త

Good news
హెచ్‌1బీ వీసా ఉన్నవారి పిల్లలకు కూడా ఉన్నత విద్యాసంస్థల్లో ఉచిత విద్య కోసం అమెరికాలోని నూజెర్సీ రాష్ట్రం చట్టం చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ ఈ బిల్లుపై మంగళవారం సంతకం చేశారు. ఈ నిర్ణయాన్ని న్యూజెర్సీలో ఉన్న భారతీయులు స్వాగతించారు. పిల్లల విద్య విషయంలో తమకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
 
అమెరికాలో ట్రంప్‌ సర్కారు వలస చట్టాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకురావడం గమనార్హం. ‘‘ఉన్నత విద్యను పొందడానికి న్యూజెర్సీ వాసులందరూ అర్హులే. అందులో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాం. విద్యార్థులు తమ లక్ష్యాలను అందుకోవడానికి, వారి ఉజ్వల భవిష్యత్తుకు ఈ చట్టం దోహదం చేస్తుంది’’ అని బిల్లుపై సంతకం చేస్తున్న సందర్భంలో మర్ఫీ అన్నారు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీ మీద రాస్తే...