శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (19:13 IST)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్.. లుక్ అదుర్స్.. (video)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. ఎన్టీఆర్ లుక్ టోటల్‌గా మార్చేశాడు. ఎన్టీఆర్ సినిమా రావాలంటే ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితుల్లో.. ఆయన ఫ్యాన్సుకు ఓ ఫోటో పండగ చేసుకునేలా చేసింది. తాజాగా సినిమాలతో పాటు అప్పుడప్పుడూ ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఎన్టీఆర్‌ తాజాగా మరో ప్రకటనలో నటించారు. ఓ వస్త్రాల బ్రాండ్‌కు తెలుగులో ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా విడుదలైన ప్రకటన అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఆ బ్రాండ్‌ దుస్తుల్లో మెరిసిపోతూ ఆయన పలికే సంభాషణలు, లుక్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి. ఈ యాడ్‌ను చూస్తే ఎన్టీఆర్‌ కూడా బాగా సన్నబడినట్లు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. ఎన్టీఆర్ సినిమాల సంగతికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. చారిత్రక పాత్రలైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, చరణ్‌ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి లుక్‌ను విడుదల చేయలేదు. అక్టోబరు 22న కొమరం భీమ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌ లుక్‌ను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.